బూతులపై క్షమాపణ చెప్పిన సబ్బంహరి | teluguglobal.in





తాను ఆక్రమించుకున్న పార్కు స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు జీవీఎంసీ అధికారులు వచ్చిన సమయంలో అధికారులపైనా, ముఖ్యమంత్రిపై అసభ్యకరమైన పదజాలంతో బూతులు తిట్టిన టీడీపీ నేత సబ్బంహరి క్షమాపణ చెప్పారు. కానీ భయపడి క్షమాపణలు చెబుతున్నానని మాత్రం అనుకోవద్దన్నారు.

తానెప్పుడూ సహనం కోల్పోలేదని చెప్పారు. నిన్న మాత్రం సహనం కోల్పోయి కొన్ని పదాలను వాడానని వివరించారు. వాటిని కొందరు చిన్నచిన్న ముక్కలు చేసి సర్కిలేట్ చేశారని వివరణ ఇచ్చారు. ”నేనూ మామూలు మనిషినే. నాకూ ఫీలింగ్స్ ఉంటాయి. వాళ్లు ఆవిధంగా తెల్లవారుజామున వచ్చి హ్యాండిల్ చేయడంతో కోపంతో కొన్ని మాటలు వాడాను. ముందే చెప్పి ఉంటే తానే తొలగించి ఉండేవాడిని. వాడిన పదాలకు మన్నించమని కోరుతున్నా. ముఖ్యమంత్రి అభిమానులకు కూడా” అని అన్నారు.

కానీ భయపడి ఈ మాటలు అంటున్నట్టు భావించవద్దని… ఇది వరకు ఎలా మాట్లాడానో అలాగే ప్రజల పక్షాన మాట్లాడుతానని సబ్బంహరి చెప్పుకొచ్చారు.



#బతలప #కషమపణ #చపపన #సబబహర #teluguglobalin



Source link

The post బూతులపై క్షమాపణ చెప్పిన సబ్బంహరి | teluguglobal.in appeared first on MyStop.



source https://myonestopshop.online/2020/10/04/%e0%b0%ac%e0%b1%82%e0%b0%a4%e0%b1%81%e0%b0%b2%e0%b0%aa%e0%b1%88-%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7%e0%b0%ae%e0%b0%be%e0%b0%aa%e0%b0%a3-%e0%b0%9a%e0%b1%86%e0%b0%aa%e0%b1%8d%e0%b0%aa%e0%b0%bf%e0%b0%a8/

Post a Comment

0 Comments