నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు | teluguglobal.in





ఊహించని విధంగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ కు గురైంది శృతిహాసన్. దీనికి కారణం ఆమె బాలీవుడ్ ను మెచ్చుకుంటూ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడ్డమే. బాలీవుడ్ మెప్పు కోసం హిందీ సినిమాల్ని మెచ్చుకుంటే.. తెలుగు-తమిళ సినిమాల సంగతేంటి అంటూ చాలామంది శృతిహాసన్ పై ట్రోలింగ్ స్టార్ట్ చేశారు. వీటిపై తాజాగా రియాక్ట్ అయింది ఈ హీరోయిన్.

“ఓ జాతీయ మీడియాకు నేనిచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని వ్యాఖ్యల్ని తప్పుగా అర్థం చేసుకొని కొన్ని తెలుగు పబ్లికేషన్లు ఇచ్చిన కథనాలు నిజం కావు. రేసుగుర్రం, గబ్బర్ సింగ్ లాంటి సినిమాల్లో భాగమైనందుకు నేను ఎంతో గర్విస్తున్నాను. మరీ ముఖ్యంగా పవన్ కల్యాణ్ గారితో చేసిన గబ్బర్ సింగ్ సినిమా నా జీవితాన్ని మార్చేసింది.”

ఇలా తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది శృతిహాసన్. నార్త్-సౌత్ సినిమాను వేరు చేసి చూడడం తనకు ఇష్టముండదంటున్న శృతి… సౌత్ సినిమా ఎప్పుడూ తన హృదయంలో ఓ భాగం అంటూ మెచ్చుకుంది.

“తెలుగు అండ్ సౌత్ ఇండస్ట్రీలో భాగమైనందుకు ఎప్పుడూ నా మనసుకు ఆనందంగానే ఉంటుంది. అది నా హృదయంలో ఓ భాగం. కేవలం నేను చేసిన హిందీ సినిమాల్ని దృష్టిలో పెట్టుకొని ఆ ఇంటర్వ్యూ ఇచ్చాను. అంతేకాదు.. నార్త్ వెర్సెస్ సౌత్ అంటూ ఇండియన్ సినిమాను విడదీయడాన్ని నేను ఎప్పుడూ ఇష్టపడను.”

ఈ వివరణ సరిపోతుందని భావిస్తున్నానని, ఇకనైనా తనపై ట్రోలింగ్ ఆపాలని వేడుకుంది శృతిహాసన్.



#ననన #తపపగ #అరథ #చసకననర #teluguglobalin



Source link

The post నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు | teluguglobal.in appeared first on MyStop.



source https://myonestopshop.online/2020/10/07/%e0%b0%a8%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8%e0%b1%81-%e0%b0%a4%e0%b0%aa%e0%b1%8d%e0%b0%aa%e0%b1%81%e0%b0%97%e0%b0%be-%e0%b0%85%e0%b0%b0%e0%b1%8d%e0%b0%a5%e0%b0%82-%e0%b0%9a%e0%b1%87%e0%b0%b8%e0%b1%81/

Post a Comment

0 Comments